సిద్దిపేట జిల్లా కాంట్రాక్టు&ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

సిద్దిపేట జిల్లా :
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉపాధి కల్పనా అధికారిని DR ప్రియాంక,మరియు ఆడిట్ అధికారిని ఆధ్వర్యంలో మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రదానంగా ఎదురుకుంటున్న సమస్యల పైన పెండింగ్ వేతనాలు IFMIS పోర్టల్ లో పేర్లు నమోదు కానీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఏజెన్సీ ల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు PF&ESI సర్దుబాటు విషయంలో అనుమానాలను కార్మిక చట్టాల హక్కులు మరియు అనుమానలను నివృతి చేసుకోవడం జరిగింది.అలాగే వివిధ శాఖల లో పని చేస్తున్న ఉద్యోగులు ఎదురు కుంటున్న సమస్యల మీద జిల్లా ఉపాధి కల్పనా అధికారిని సమక్షంలో చర్చించి పరిష్కారం దిశగా ఉన్నతధికారుల దృష్టికి పోయే విదంగా మరియు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ లను ఉద్యోగ సంఘ నాయకుల అయినా తెలంగాణ నాన్ గజిటెడ్ మరియు తెలంగాణా రాష్ట్ర ఔట్ సోర్సింగ్ JAC కలెక్టరేట్ ఉద్యోగుల సంఘo అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో ఈ సమావేశం విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సిద్దిపేట జిల్లాలో జిల్లా TNGO'S ప్రధాన కార్యదర్శి కోమాండ్ల విక్రమ్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మ సురేందర్ రెడ్డి,కలెక్టరేట్ అధ్యక్షులు సుమన్,ఔట్ సోర్సింగ్ ఎంప్లాయస్ రాష్ట్ర JAC చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నమళ్ళ యాదగిరి, వర్కింగ్ ప్రెసిడింట్ రాజమల్లు,కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు కపిల్ రెడ్డి,వాసవి,సుమలత, మౌనిక, గౌతమి,రాజేష్,బిక్షపతి,అభిలాష్,నాగరాజు,పని చేస్తున్న కాంట్రాక్టు&ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!













