12/11/2026, Thursday · 06:01:26 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

అంబేద్కర్ నగర్ యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్.

Teegala sravan Kumar 08/11/2026 4:31 AM రాజన్న సిరిసిల్ల 21

అంబేద్కర్ నగర్ యూపీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్.
Want this news as a newspaper clip?Print News Clip
  • అర్హులైన బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు.
  • క్యాన్సర్ నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి.

సిరిసిల్ల పట్టణం, నవంబర్ 07, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (యూపీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫార్మసీ స్టోర్‌ను పరిశీలించి మందుల నిల్వలు, పంపిణీ విధానం, రికార్డులు, వివిధ రిజిస్టర్ల నిర్వహణను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అర్హులైన బాలికలందరికీ టీకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఔట్‌రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రతి అర్హత కలిగిన చిన్నారికి టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్‌సీడీ)లో భాగంగా రిజిస్టర్లను పరిశీలించారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేలా పరీక్షలు నిర్వహించాలని, బాధితులకు అవసరమైన చికిత్సతో పాటు నిరంతర ఫాలోఅప్ చేపట్టాలని సూచించారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు క్యాన్సర్ వ్యాధులపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం, ధూమపానం, మద్యపానం వల్ల క్యాన్సర్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలకు వివరించాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం, క్రమబద్ధమైన జీవనశైలిని పాటించడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

spontaneously inspectedAngelaAlfredDMHOAmbedkarNagarUPHC

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

68 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.