12/11/2026, Thursday · 06:01:30 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

8న జిల్లావ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.

Teegala sravan Kumar 06/11/2026 9:07 PM రాజన్న సిరిసిల్ల 28

8న జిల్లావ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.
Want this news as a newspaper clip?Print News Clip
  • ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
  • అధికారులకు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశాలు.

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 6,కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ముందు గోడలపై ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ లోగో స్టిక్కర్‌ను అతికించి, లబ్ధిదారుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఎదుట దీపం వెలిగించి, ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ద్వారా ఫొటోలు తీసి సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల వార్డు అధికారులు పూర్తయిన ఇళ్ల వద్ద లబ్ధిదారులతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందు, నిర్మాణం పూర్తయిన తర్వాత పరిస్థితిని తెలియజేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తమ పరిధిలో పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను గుర్తించి, లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, హౌసింగ్ శాఖ, ఇతర శాఖల అధికారులు ఇందిరమ్మ గృహ నిర్మాణ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పూర్తయిన ఇళ్లను సందర్శించి లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ స్పష్టం చేశారు.

ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

celebrations acrossDiwaliIndirammahousedistrict

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

68 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.