12/11/2026, Thursday · 05:53:04 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.

Teegala sravan Kumar 11/11/2026 8:12 AM రాజన్న సిరిసిల్ల 4

రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు, పత్తికి రూ.50 వేల పరిహారం చెల్లించాలి.
  • కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకుల నిరసన ధర్నా.

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

 ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో జిల్లా రాజన్న సిరిసిల్లను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ.30 వేల చొప్పున, పత్తి పంటకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రేషన్ ఉత్పత్తుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పశువులకు అవసరమైన మేతను కూడా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు కడారి రాములు, గుంటి వేణు, తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, దుండ్రుపల్లి రవీందర్, నారాయణ నిర్వహించారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.

Sircilla districtRajannadeclareddroughtzone

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

68 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!