12/11/2026, Thursday · 06:01:25 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

అమృతకు బండి ఆపన్న హస్తం తక్షణ సాయంగా రూ.50 వేలు పంపిన కేంద్ర మంత్రి

Teegala sravan Kumar 07/11/2026 7:13 PM రాజన్న సిరిసిల్ల 27

అమృతకు బండి ఆపన్న హస్తం

తక్షణ సాయంగా రూ.50 వేలు పంపిన కేంద్ర మంత్రి
Want this news as a newspaper clip?Print News Clip
  • తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయండి
  • సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కోరిన బండి సంజయ్
  • ఇల్లు మంజూరయ్యాక కుటుంబానికి అవసరమైన సరుకులన్నీ ఇవ్వండి.

వేములవాడ , నవంబర్ 07, కే న్యూస్ తెలుగు ప్రతినిధి.

సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా రూ.50 వేలు పంపారు. ఈ నగదు మొత్తాన్ని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ద్వారా బాధితురాలకు అందజేశారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తో కేంద్ర మంత్రి ఫోన్లో మాట్లాడుతూ అమృత దుస్థితిని వివరించారు. అమృతకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. మరోవైపు అనారోగ్యం బారిన పడిన కొడుకుతో కలిసి శ్మశానంలో నివసిస్తూ పుట్టెడు దుఃఖంలో ఉన్న అమృతకు అన్ని విధాలా అండగా ఉండాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైన వెంటనే ఆ ఇంటికి అవసరమైన సామాగ్రితోపాటు కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులను అందించాలని కోరారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

Minister sendsUnion000asimmediateassistanceAmrutha

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

68 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.