అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి.

- సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
- జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
- గంభీరావుపేట మండలం గజసింగవరంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమం
- గర్భిణులకు సామూహిక సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన
- అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారంతో పిల్లలు, గర్భిణులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
గంభీరావుపేట మండలం, నవంబర్ 10, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
గంభీరావుపేట మండలం గజసింగవరంలోని అంగన్వాడీ మంగళవారం 10 నిమిషాల పేరుతో నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి చూపారు. అంగన్‌వాడీ కేంద్రానికి ఎంత మంది పిల్లలు వస్తున్నారో ఆరా తీసి.. వారి ఎత్తు, బరువు చూసి.. ఆరోగ్య కార్డుల్లో వివరాలు నమోదు చేసిన తీరును పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, మందులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు. కొంతమంది గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, బెల్లం, నువ్వులు బాలామృతంతో సిద్ధం చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం 10 నిమిషాలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్నామని, కేంద్రాల్లో సేవలు, సౌకర్యాలు మెరుగుపర్చడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి నెలా తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని, దీంతో వారి బంగారు భవితకు బాటలు పడతాయని స్పష్టం చేశారు. సామ్, మా పిల్లలపై సర్పంచ్, అంగన్వాడీ కేంద్రం బాధ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తీవ్రమైన పోషకాహార లోపం, మధ్యస్థ తీవ్ర పోషకాహార లోపం, తీవ్రమైన తక్కువ బరువు, మధ్యస్థ తక్కువ బరువు ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తారని వివరించారు. నేషనల్ ఇన్ ఐడియల్ ఆఫ్ న్యూట్రిషన్ వారు తయారు చేసిన బాలామృతం, బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బాలామృతం ప్లస్ తో పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసి అందించారు. నీరు వేడి చేసి చల్లారిన తర్వాత అందించబడింది. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం అందజేయడంతో పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఆట, పాటల బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. పిల్లల ఆరోగ్యం, చదువు భవిష్యత్తు తల్లితండ్రుల ఇద్దరి బాధ్యతని తెలియజేసారు. సరైన పోషకాహారం ఇంట్లో కూడా సూచించారు.
ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి
గర్భిణులు బాలింతలు మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పోషకాహారం జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎదుగుదల లోపించిన పిల్లలకు వైద్యం అందించాలి
5 సంవత్సరాలలో వయసు ఉన్న పిల్లలు ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం అందించపు జిల్లా కలెక్టర్ గరిమవాల్ సూచించారు. ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల ఉన్న పిల్లలు, మెదడు సమస్యలు, సరిగా మాట్లాడలేని పిల్లలు, రక్తహీనత, పోషకాహారం లోపం గల పిల్లలను *బాల భరోసా* కింద అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లల లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఐసీ కేంద్రానికి తరలించి ..ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటున్నారని. సేవలను సద్వినియం చేసుకోవాలని సూచించారు. ఉన్నత వైద్య సేవలు కరీంనగర్, హైదరాబాద్ లో అందజేశారని.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి హనుమంతు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!














