హక్కుల సాధనకు కొత్త దిశ..

- కమిషనర్ దేశాల భూపాల్‌ను సత్కరించిన భూర్ల రేణు కుమార్
కామారెడ్డి జిల్లా నవంబర్ 10 : k24 న్యూస్ తెలుగు : హైదరాబాద్‌లో నిర్వహించిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ 2వ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు హక్కులపై అవగాహన కల్పిస్తూ, హక్కుల సాధన కోసం కృషి చేస్తున్న కమిటీ ప్రతినిధులకు ఆయన పలు విలువైన సూచనలు, సలహాలు అందించారు.
అనంతరం కమిటీ వ్యవస్థాపక ఛైర్మన్, జాతియ అధ్యక్షులు చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి తో కలిసి రాష్ట్ర కార్యదర్శి భూర్ల రేణు కుమార్ కమిషనర్ దేశాల భూపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!












