సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏఐసిటిఇ-వాణి జాతీయ సదస్సు ముగింపు

హైదరాబాద్:K24NEWS హైదరాబాద్‌లోని సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్నీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన ఏఐసిటిఇ-వాణి (AICTE-VAANI) ప్రాయోజిత జాతీయ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. “హెల్త్‌కేర్ అండ్ మెడికల్ సెక్టార్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం” అనే అంశంపై "ఉర్దూ భాషలో హెల్త్‌కేర్ మరియు మెడ్‌టెక్" అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ ఇంతియాజ్ హసన్ విచ్చేశారు. సివిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామమోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో, సిఎస్ఇ హెచ్‌ఓడి ప్రొఫెసర్ డాక్టర్ ఎ. వాణి వత్సల కన్వీనర్‌గా ఈ వర్క్‌షాప్‌ను పర్యవేక్షించారు.
ఆరోగ్య సంరక్షణ రంగంలో జనరేటివ్ ఏఐ (Generative AI), వ్యాధి నిర్ధారణ, పర్సనలైజ్డ్ మెడిసిన్, డేటా ప్రైవసీ వంటి అత్యాధునిక సాంకేతికతలపై ప్రముఖ విద్యా, పారిశ్రామిక రంగాల నిపుణులు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు మరియు శిక్షణ ఇచ్చారు.
ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!












