కోటాగారం MPTC ఎన్నికల్లో హరీష్ యాదవ్ భారీ విక్టరీ

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) నవంబర్ 08. చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కట్టుదిట్టమైన భద్రతా నడుమ నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ కౌంటింగ్ కేంద్రంలో జిడి నెల్లూరు మండలం పరిధిలోని కోటాగారం ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి.హరీష్ యాదవ్ తన ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతను ప్రదర్శించి విజయం సాధించారు. కోటాగారం ఎంపీటీసీ సెగ్మెంట్ నుండి బరిలో నిలిచిన హరీష్ యాదవ్ మొత్తం 1,203 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థి వి.హరీష్ యాదవ్ మాట్లాడుతూ తనను నమ్మి భారీ మెజారిటీతో గెలిపించిన కోటాగారం&కలిజవేడు ప్రజలకు, గ్రామస్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ, శ్రమించిన కూటమి నాయకులు, కార్యకర్తల సేవలను ఆయన కొనియాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్థానిక ప్రాంత అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడానికి నిరంతరం శ్రమిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విజయం ద్వారా ఆ ప్రాంతంలో కూటమి పార్టీల పట్టు మరింత బలపడిందని నాయకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో స్థానిక సమస్యల పరిష్కారానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ విజయం మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. అధికారులు విజేత హరీష్ యాదవ్ కు అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భవిష్యత్తులో స్థానిక సమస్యల పరిష్కారానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ విజయం మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన MPTC కి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!












