12/11/2026, Thursday · 05:53:11 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్

Teegala sravan Kumar 11/11/2026 10:38 PM రాజన్న సిరిసిల్ల 2

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్
Want this news as a newspaper clip?Print News Clip

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 11, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

బి.జె.ఆర్. అగ్రికల్చర్ కళాశాల సంయుక్త నిర్వహణలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో భాగంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026-27 కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ‘నషా ముక్త్ యువ – డ్రగ్ ఫ్రీ ఇండియా’ అనే అంశంపై జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, మాదకద్రవ్యాల నిర్మూలన, యువత బాధ్యత, సమకాలీన సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను ప్రసంగాల రూపంలో వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి.జె.ఆర్. అగ్రికల్చర్ కళాశాల డీన్ డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల, దేశ పురోగతి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇలాంటి యూత్ పార్లమెంట్ పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ సామర్థ్యాలను, వక్తృత్వ నైపుణ్యాలను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. మొదటి బహుమతిని రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన దీప్తి రాయ్, రెండో బహుమతిని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎస్.కె. రామిజ్ రాజా, మూడో బహుమతిని సి.హెచ్. అవినాష్ రెడ్డి గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి గోలీ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మై భారత్ రాజన్న సిరిసిల్ల కార్యక్రమ అధికారి జి. కిరణ్ కుమార్, అగ్రికల్చర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ రజియా, తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ డాక్టర్ అంజయ్య, నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చైతన్య, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల లెక్చరర్ నవ్య, సైకాలజిస్ట్ పున్నం చందర్, మై భారత్ ప్రతినిధులు లోపెల్లి రాజు, అక్కెం నాగరాజు, సాయి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

Yuva BharatMeraaegisUnionMinistryYouthAffairsSports

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

68 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!