12/11/2026, Thursday · 05:53:11 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.

Teegala sravan Kumar 11/11/2026 10:39 PM జిల్లా వార్తలు 2

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.
Want this news as a newspaper clip?Print News Clip

గంభీరావుపేట మండలం, నవంబర్ 11,కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

భూముల రీసర్వే పై రైతులు కనీస అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణ సమయంలో అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. 

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ బుధవారం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

రీ సర్వే ప్రక్రియ చేపడుతున్న బృందం భూముల వివరాలను ఖచ్చితత్వంతో సేకరించాలని, రైతులకు భూముల రీ సర్వేపై అవగాహన కల్పించాలని అన్నారు. పారదర్శకంగా, రైతుల సమక్షంలో భూముల రీ సర్వే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.  

రైతులు భూముల రీ సర్వే పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల సూచనలు రైతులు ఖచ్చితంగా పాటించాలని, వరికి బదులుగా ఇతర ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఆయిల్ పామ్, ఇతర కూరగాయల పంటలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్న రైతుల అనుభవాలను తెలుసుకొని పంటలు సాగు చేయాలని సూచించారు. 

ఈ సమావేశంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, సర్వేయర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.

Gaddam NageshLandresurveyinspectedKurduligampalliGambhiraoPetaMandal

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

68 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!