జైపూర్ జర్నలిస్టు జేఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

- జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, హక్కుల సాధనకు సమష్టి కృషి
జైపూర్, నవంబర్ 5 (తెలుగు కే న్యూస్ ప్రతినిధి గంగాధరి రాజయ్య):
జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన జర్నలిస్టు జేఏసీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, హక్కుల సాధనే లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
నూతన కార్యవర్గం వివరాలు
చైర్మన్‌గా భూమన్న, వైస్ చైర్మన్లుగా సోదరి దుర్గాప్రసాద్, గోదారి కరుణాకర్, కో-కన్వీనర్లుగా పల్ల రాజశేఖర్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, ఎలుకటూరి నరేష్, జనరల్ సెక్రటరీగా వేముల శ్రావణ్ కుమార్, ట్రెజరర్‌గా గురునాథం బాలరాజు గౌడ్ ఎన్నికయ్యారు.
సలహాదారులుగా ఆవిడపు వెంకటేష్, అరిగల రవీందర్ గౌడ్, సుంకరి శ్యాం కుమార్, కో-ఆర్డినేటర్లుగా మార్క శేఖర్, మోతే సాయిబాబా, మంతెన సతీష్, కటుకూరి తిరుపతి, గంగాధరి రాజన్న, నేరెళ్ల నరేష్ గౌడ్, పులి మదినేష్, గాజుల సదానందం, ఎండీ నిజామోద్దీన్ ఎంపికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా రేగుంట వెంకటేష్, తోడుపునూరి కృష్ణమూర్తి, రామటంకి భీమరాజ్, కుమ్మరి మల్లేష్, దుస్తా వివేక్ సాయి, కుర్ర శ్రీకర్, రామగిరి రాము, ఎండీ నజీర్, సోదరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమష్టి పోరాటం
ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల కేటాయింపు, జైపూర్ మండల కేంద్రంలో ప్రెస్ భవనం ఏర్పాటు వంటి ప్రధాన డిమాండ్ల సాధనకు సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.
ఈ సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలు అందించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో తీర్మానించారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, ఐక్యత కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది.
ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!












