12/11/2026, Thursday · 06:11:21 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

తుపాకీ కంటే పెన్నే శక్తివంతమైన ఆయుధం.. విద్యతోనే సమాజంలో మార్పు

Katta Ravinder 05/11/2026 10:16 AM మంచిర్యాల 23

తుపాకీ కంటే పెన్నే శక్తివంతమైన ఆయుధం.. విద్యతోనే సమాజంలో మార్పు
Want this news as a newspaper clip?Print News Clip
  • దండారి ధర్బార్‌లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు

కాసిపేట: తెలుగు కే న్యూస్ తుపాకీ కంటే పెన్నే శక్తివంతమైన ఆయుధమని, విద్యతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలంలోని దేవాపూర్ సల్పల వాగు ప్రాంతంలో గిరిజన ఆదివాసీల సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించిన దండారి ధర్బార్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివాసీ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, దేవాపూర్ ఆదానీ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. గతంలో ఆదివాసీ బిడ్డలు తమ హక్కుల సాధన కోసం తుపాకీని నమ్మి పోరాటాలు చేసిన సందర్భాలను మనమంతా చూశామని గుర్తుచేశారు. అయితే నేటి పరిస్థితుల్లో తుపాకీ కంటే పెన్ను ఎంతో శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. హింసతో కాకుండా విద్యతోనే సమాజంలో నిజమైన మార్పు తీసుకురావచ్చని, ఆదివాసీ యువత పోరాట బాట నుంచి ప్రగతి బాట వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

తుపాకీ పట్టే చేతుల్లో పెన్ను ఉండాలని, చదువే నిజమైన ఆయుధమని, విద్య ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ఆదివాసీ యువత ఉన్నత విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భగవంతుడు, ఆదివాసీ దేవతలు ప్రతి కుటుంబాన్ని సుఖసంతోషాలతో చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

అనంతరం ఆదివాసీ ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాలని దేవతలను ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి పెంద్రం హనుమంతు అధ్యక్షత వహించారు.

ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కాసిపేట మండల అధ్యక్షుడు బి.వి. రమణారెడ్డి, లంక లక్ష్మణ్, జాడి రాంచందర్, రామటెంకి వాసుదేవ్, అటుకపురం రమేష్, డీసీసీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వేముల కృష్ణ, సిద్ధం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

తుపాకీ కంటే పెన్నే శక్తివంతమైన ఆయుధం.. విద్యతోనే సమాజంలో మార్పు

powerful weaponpengunchangesocietyeducation

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

telangana

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

74 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.