పుట్టిన పసికందును చెట్టపోదలో వదిలేసి వెళ్లిపోయిన అమానవీయ ఘటన

- తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందు ముళ్ళ పొదల్లో కన్నీటి
కామారెడ్డి జిల్లా నవంబర్ 5: k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లాలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయిన అమానవీయ ఘటన దొమకొండ మండల గ్రామ శివారులో కలకలం రేపింది. అయితే గొర్రెల కాపర్ల అప్రమత్తతతో శిశువుకు ప్రాణాపాయం తప్పింది.
దొమకొండ మండల గ్రామ శివారులోని చెట్ల పొదల మధ్య నుంచి పసికందు ఏడుపు వినిపించడంతో అటుగా గొర్రెలు కాస్తున్న కాపర్లు గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన శిశువు కనిపించింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శిశువును రక్షించారు. తొలుత దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అసలు శిశువును ఎవరు వదిలివెళ్లారు. ఏ పరిస్థితుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పసికందును పొదల్లో వదిలేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!













