K24 News Telugu
Date of Publish : 11/11/2026, 10:39 pm
Published By Teegala sravan Kumar

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్.

గంభీరావుపేట మండలం, నవంబర్ 11,కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

భూముల రీసర్వే పై రైతులు కనీస అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణ సమయంలో అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. 

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ బుధవారం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

రీ సర్వే ప్రక్రియ చేపడుతున్న బృందం భూముల వివరాలను ఖచ్చితత్వంతో సేకరించాలని, రైతులకు భూముల రీ సర్వేపై అవగాహన కల్పించాలని అన్నారు. పారదర్శకంగా, రైతుల సమక్షంలో భూముల రీ సర్వే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.  

రైతులు భూముల రీ సర్వే పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల సూచనలు రైతులు ఖచ్చితంగా పాటించాలని, వరికి బదులుగా ఇతర ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. జిల్లాలో ఆయిల్ పామ్, ఇతర కూరగాయల పంటలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్న రైతుల అనుభవాలను తెలుసుకొని పంటలు సాగు చేయాలని సూచించారు. 

ఈ సమావేశంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, సర్వేయర్, తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save