12/11/2026, Thursday · 06:29:08 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కార్తీక మాస ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష.

Teegala sravan Kumar 30/10/2026 10:00 PM రాజన్న సిరిసిల్ల 32

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కార్తీక మాస ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష.
Want this news as a newspaper clip?Print News Clip
  • ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ, అక్టోబర్ 30, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు మరియు రాబోయే కార్తీక మాసంలో భక్తులకు కల్పించాల్సిన మెరుగైన వసతులపై హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ.ఏ.ఎస్. శ్రీమతి శైలజ రామ్ అయ్యర్ , దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ ఐ.ఏ.ఎస్. శ్రీ హనుమంతరావు , దేవాదాయ ధర్మాదాయ ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద హరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

రాజన్న ఆలయానికి అనుబంధ అలయమైన శ్రీ భీమేశ్వరాలయంలో రాబోయే కార్తీక మాస దీపోత్సవాలు, పూజల నిమిత్తం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరియు ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి పాల్గొని, అధికారులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.  సమీక్షలో ఆర్ అండ్ బి (R&B) చీఫ్ ఇంజనీర్ (CE), కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కార్తీక మాస ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష.

level reviewhighdevelopmentVemulawadaRajannaTempleKarthikaMasa

About the author

Teegala sravan Kumar

Teegala sravan Kumar

District Incharge

68 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.