12/11/2026, Thursday · 06:01:20 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌

Katta Ravinder 15/10/2026 2:17 PM అంతర్జాతీయం 26

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌
Want this news as a newspaper clip?Print News Clip
  • రెండు సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం
  • జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌ నౌక దగ్ధమై సముద్రంలో మునక
  • రెండు నౌకల్లోని 43 మంది సిబ్బంది సురక్షితం
  • నౌక మైన్‌ను ఢీకొని మునిగిపోయిందన్న ఇరాన్‌ నేవీ

హర్మూజ్‌ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన రెండు కంటైనర్‌ నౌకలపై దాడులు జరిగినట్లు సింగపూర్‌ మారిటైమ్‌ అండ్‌ పోర్ట్‌ అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌ అనే నౌకలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమై సముద్రంలో మునిగిపోయింది. అయితే, నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.

మరో నౌక జీఎఫ్ఎస్‌ గిసెల్‌ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ సురక్షిత ప్రాంతానికి చేరుకుందని, అందులోని 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. రెండు నౌకల్లోనూ సింగపూర్‌ పౌరులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. సముద్ర మార్గంలో ప్రయాణించే ఇతర నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు, ఈ ఘటనపై ఇరాన్‌ భిన్నమైన వాదనను వినిపించింది. తమ జలాల్లోకి అనధికారికంగా ప్రవేశించిన నౌక నేవల్‌ మైన్‌ను ఢీకొని పేలిపోయిందని ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ నేవీ పేర్కొంది. నౌకలో 2,500కు పైగా కంటైనర్లు ఉన్నాయని, సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్లతో ఇతర నౌకలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. హర్మూజ్‌ జలసంధిని తమ నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తోందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నేవీ కమాండర్‌ అలీ అజ్మాయీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

SingaporeshipsinksStraitHormuz

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

telangana

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

74 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.