12/11/2026, Thursday · 06:01:29 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

తుపాను పరిస్థితులపై కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్

BHOOM REDDY CH 27/10/2026 3:59 PM రాష్ట్ర వార్తలు 23

తుపాను పరిస్థితులపై కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్
Want this news as a newspaper clip?Print News Clip
  • ముందస్తు చర్యల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం

అమరావతి, అక్టోబర్ 27:-అర్నబ్ తుపాను నేపథ్యంలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను పరిస్థితులు, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లతో సమీక్షించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

టెలికాన్ఫరెన్స్‌లో ప్రధానంగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండటం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంపై హోంమంత్రి దృష్టి సారించారు. బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవసరమైన చోట సహాయక చర్యలు వేగంగా చేపట్టేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

తుపాను సమయంలో ప్రజలకు సరైన సమాచారం చేరవేయడం అత్యంత ముఖ్యమని హోంమంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణలేని వార్తలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు జారీ చేసే అధికారిక సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

anita telikanpharenstupanuparisthitulapaikalektarlatohommamtri

About the author

BHOOM REDDY CH

BHOOM REDDY CH

Chief Editor

23 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.