12/11/2026, Thursday · 06:09:15 AM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

కామారెడ్డి జిల్లా చరిత్రలో మొదటి సారిగా 435 యూనిట్ల రక్తం సేకరణ

Katta Ravinder 24/10/2026 6:42 PM కామారెడ్డి 23

కామారెడ్డి జిల్లా చరిత్రలో మొదటి సారిగా 435 యూనిట్ల రక్తం సేకరణ
Want this news as a newspaper clip?Print News Clip
  • తల సేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం కదిలిన జిల్లా పోలీసు శాఖ

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 24:k24 న్యూస్ తెలుగు:

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా 435 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకుగాను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గారికి తల సేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు ఎండి జమీల్ అమ్మద్ లు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 నుండి రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందని, ఇప్పటివరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎప్పుడూ కూడా 435 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరగలేదని ఈ రోజు చరిత్రలో కనివిని ఎరుగని విధంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సహకారం మరియు జిల్లా పోలీసు శాఖ యంత్రాంగం సహకారంతో తల సేమియా బాధిత చిన్నారుల కోసం,ప్రభుత్వ వైద్యశాలలో పేషంట్ల కోసం రక్తాన్ని సేకరించడం వారి కుటుంబాలకు ఎంతగానో తోడ్పడుతుందని,రక్తం దొరకక ఎంతోమంది తలసేమియా చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వారి ప్రాణాలను కాపాడడం కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్స్ ను అందజేసిన దాతలకు కృతజ్ఞతలను తెలియజేశారు.హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వారి సహకారంతో రక్తదాతలకు పండ్లను పంపిణీ చేయడం జరిగిందని ఈ శిబిరానికి సహకరించిన కామారెడ్డి జిల్లా రక్తదాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి :: 30 ఏళ్లుగా నివాసముంటున్న ఎస్టీ కుటుంబానికి అన్యాయం!

కామారెడ్డి జిల్లా చరిత్రలో మొదటి సారిగా 435 యూనిట్ల రక్తం సేకరణ

were collectedtimehistoryKamareddydistrictunitsblood

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

telangana

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

74 Posts

Latest News

మహిళ భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలి. చదువే విద్యార్థి ప్రగతికి ఆధారం విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి లో భూముల రీ సర్వే పరిశీలించిన:జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ ప్రచారంలో దూసుకుపోతున్న వంచ సుదర్శన్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి ప్యానెల్ అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. -జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె. రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.