Constituency Incharge
3 days ago
కోస్లీలో ఘనంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం, కోస్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వీట్లు పంపిణీ చేసి, దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాబు సింగ్, ఉపసర్పంచ్ సందీప్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు


