Constituency Incharge
9 days ago
కోస్లీలో నీటి సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో గ్రామసభ నిర్వహించి నీటి సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.



