K24 News Telugu
Date of Publish : 12/11/2026, 7:33 am
Published By Katta Ravinder

కట్ట ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరిగేనా?

  • గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్‌సీఎస్‌టీ దృష్టికి వినతి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ

కోహెడ | K24 NEWS 

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోహెడ గ్రామంలో కట్ట ప్రవీణ్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై గిరిజన హక్కుల పరిరక్షణ కోసం న్యాయం కోరుతూ హైదరాబాద్‌లో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ) దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

కట్ట ప్రవీణ్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి గత 30 సంవత్సరాలుగా సంబంధిత స్థలంలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారని, ఇటీవల తమ నివాసాన్ని నేలమట్టం చేయడంతో కుటుంబం తీవ్ర నష్టానికి గురైందని, ఆస్తి నష్టం జరగడంతో పాటు కుటుంబం రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎన్‌సీఎస్‌టీ ఉషన్ నాయక్‌ను కలిసి గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, నివాసాన్ని తొలగించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.

కట్ట ప్రవీణ్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్పందించిన ఉషన్ నాయక్.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

అధికారుల స్పందన ఎప్పుడు?

30 సంవత్సరాలుగా నివాసముంటున్న గిరిజన కుటుంబం ఒక్కసారిగా నిరాశ్రయులుగా మారడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. గిరిజన కుటుంబానికి జరిగిన నష్టంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

రాజకీయ మార్పులు, గ్రామపంచాయతీ పాలకులు మారినా బాధిత కుటుంబానికి న్యాయం అందకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో బాధ్యులెవరు? కుటుంబ నివాసాన్ని తొలగించడానికి అనుసరించిన విధివిధానాలు ఏమిటి? బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందుతుందా? తిరిగి నివాసం కల్పిస్తారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

కట్ట ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు సంబంధిత అధికారులు స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని గిరిజన హక్కుల పరిరక్షకులు కోరుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save