సిరిసిల్ల పట్టణం నవంబర్ 11 కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) బృందం ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని సహస్ర జూనియర్ కళశాలలో షీ టీమ్, AHTU ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటి వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు , మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచరం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలపాలని అధికారులు సూచించారు.బాలికల, విద్యార్థుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందని, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా, వేధింపులకు గురిచేసినా, ర్యాగింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులకు గురైన విద్యార్థినులు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీమ్ కి ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ అవసరమైన రక్షణ, సహాయం అందిస్తామని భరోసా కల్పించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకింగ్ సమాచారం ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.ఈకార్యక్రమంలో షీ టీం ఏ ఎస్.ఐ ప్రమీల , షీ టీం సిబ్బంది, AHTU సిబ్బంది పాల్గొన్నారు.