K24 News Telugu
Date of Publish : 09/11/2026, 10:03 pm
Published By Gunnala Surendar

ఖిల్లా రఘునాథ ఆలయ ముఖద్వారం వద్ద అగ్నిప్రమాదం..

నిజామాబాద్ ప్రముఖ ఖిల్లా రఘునాథ ఆలయంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఆలయ ముఖద్వారం దాటిన తర్వాత ఇరువైపులా ఉన్న గదుల్లో ఒక గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్, 5వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఏసీపీ ప్రకాశ్, 5వ టౌన్ ఎస్సై, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో లీడింగ్ ఫైటర్ ఫైటర్ ఏసురత్నం, ఫైర్ ఫైటర్లు శ్రీనివాస్, సురేందర్ కొనసాగుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save