కామారెడ్డి జిల్లా నవంబర్ 9 : k24 న్యూస్ తెలుగు : సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వడ్ల లత సోమవారం టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాయ గౌడ్, మండల మహిళ అధ్యక్షురాలు ఉప్పల్వాయి సంధ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సాయాగౌడ్ మాట్లాడుతూ ఉచిత విద్య, ఉచిత వైద్యంతో ముందుకెళ్తున్న పాంచజన్య పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ సంపత్ గౌడ్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పాంచ జన్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మోసర్ల శ్రీకాంత్ రెడ్డి , టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రాజు, శివ నిర్వహించారు.