K24 News Telugu
Date of Publish : 09/11/2026, 9:02 pm
Published By srikanth

ప్రజావాణిలో ప్రజల నుంచి 45 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్ విక్టర్

  • ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

కామారెడ్డి జిల్లా నవంబర్ 9 : k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ ప్రజల నుంచి 45 మంది ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశతో ప్రజావాణి వస్తారని, అధికారులు వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కారానికి తీసుకున్న చర్యలను పరిశీలించడానికి. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save