తెలుగు కే న్యూస్కా కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని. తెలంగాణ రక్షణ సేన కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్ ఆధ్వర్యంలో ప్రజావాణి లో వినతిపత్రం అందించడం జరిగింది. రోడ్ల సమస్యను పరిష్కరించి, అవసరమైన చోట సీసీ రోడ్లు నిర్మించాలి.
మురుగు కాలువలు ఇప్పటికే ఉన్న మురుగు కాలువల్లో పూడికలు తొలగించి, మురుగు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.
మిషన్ భగీరథ పైప్లైన్ వేయకపోవడంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. వెంటనే పైప్లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన యువజన నాయకులు గంగాధరి రాజ్ కుమార్ పాలుగోన్నారు.