K24 News Telugu
Date of Publish : 09/11/2026, 4:34 pm
Published By srikanth

ఘనంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రెండో వార్షికోత్సవ వేడుకలు

  • కామారెడ్డి జిల్లా తరఫున కేక్ కటింగ్ కార్యక్రమం విజయవంతం

కామారెడ్డి జిల్లా నవంబర్ 9 :k24 న్యూస్ తెలుగు : సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపకులు చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి సూచనలతో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రెండో వార్షికోత్సవ వేడుకలను కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి వార్షికోత్సవ వేడుకలను విజయవంతంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి లోకోటి రమేష్ రావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రౌతు శ్రీకాంత్, జిల్లా ఇన్‌చార్జ్ సతీష్ కుమార్, కామారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు పిట్ల స్వామి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాకేష్, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్, కామారెడ్డి మున్సిపాలిటీ ఇన్ చార్జి వి. భాస్కర్ చారి జరిగింది.

ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ప్రజల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save