తెలుగు కే న్యూస్ నవంబర్ 8. తిమ్మాపూర్ మండలం రామహనుమాన్ నగర్ గ్రామంలోఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు.
కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. దీపాల వెలుగులతో ఇళ్లు కళకళలాడగా, కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
సొంతింటి కల నెరవేరిన ఆనందంలో దీపావళి వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ వడ్లకొండ తిరుపతి సర్పంచ్ పిస్కా సౌజన్య కృష్ణ కిషోర్ వార్డు మెంబర్కుల రాజమణి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు