K24 News Telugu
Date of Publish : 08/11/2026, 6:04 pm
Published By Gunnala Surendar

మగ్గిడి గ్రామంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం: మగ్గిడి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం నాగరాజు, మగ్గిడి సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్, మాజీ డీసీసీ ఉపాధ్యక్షుడు దేవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తౌడ్ శెట్టి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు పినిల్, ఉల్లెంగ శ్రీనివాస్, బద్దం పెంటవ్వ, బొంత భూలక్ష్మి, మాజీ ఉపసర్పంచ్ నర్సయ్య, ఆరె చంద్రకాంత్, రూపేష్, డైనమిక్ సాయి కుమార్, తెనుగు నవీన్, ఇంట్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save