K24 News Telugu
Date of Publish : 08/11/2026, 1:22 pm
Published By Gunnala Surendar

సుబ్బిర్యాల్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

  • లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ నియోజకవర్గం: నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సుబ్బిర్యాల్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను (ప్రొసీడింగ్స్) అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ దీపావళి పండుగ రోజున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం శ్రీనివాస్, వార్డు సభ్యులు చరణ్, రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తలారి రాకేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు భూమా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, లవన్ కుమార్, మహేందర్, ఎర్రన్న, శేఖర్, నారాయణ రెడ్డి, గంగారెడ్డి తదితరులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save