కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) నవంబర్ 07. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమం సోసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో అనాథల కోసం ప్రత్యేకంగా అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ కార్యనిర్వాహకులు బండి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి శనివారం అనాథల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సమాజంలో నిరాశ్రయులకు అండగా నిలవడమే తమ ధ్యేయమని ఆమె. ఈ సేవా కార్యక్రమంలో బండి పట్టాభి రెడ్డి, దామోదర్ రెడ్డి, మాధవిలత, విజయ, రఘునాథరెడ్డి ఉత్సాహంగా పాల్గొని స్వయంగా భోజనాలు వడ్డించి ఆశ్రమవాసులకు అండగా నిలిచారు.