K24 News Telugu
Date of Publish : 08/11/2026, 4:32 am
Published By Teegala sravan Kumar

మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

  • సమస్యల పరిష్కారానికి హామీ.. సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు
  • సిరిసిల్లలో కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపిన సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్ బాబు.

సిరిసిల్ల పట్టణం, నవంబర్ 07, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.

సిరిసిల్ల మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల కోసం చేపట్టిన మూడో రోజు సందర్భంగా మున్సిపల్ కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా సమ్మెకు తెలిపిన స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి చర్చలు జరిపి పరిష్కరించాలని కోరారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్ కార్మిక సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు సమ్మెను విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, అన్నల్దాస్ గణేష్, మున్సిపల్ యూనియన్ నాయకులు శంకర్, అర్జున్, బాబా కిషన్, దేవరాజు, విజయ, లక్ష్మి రమేష్ పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save