K24 News Telugu
Date of Publish : 07/11/2026, 4:57 pm
Published By srikanth

ఏఎస్‌డీడీ జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం

  • నవంబర్ 21వ తేదీలోగా గణన పత్రాలు సమర్పించాలి
  • అడిషనల్ కలెక్టర్ విక్టర్

కామారెడ్డి జిల్లా నవంబర్ 7: k24 న్యూస్ తెలుగు :    భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఏఎస్‌డీడీ జాబితాలో గుర్తించబడిన ఓటర్లకు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు అడిషనల్ కలెక్టర్,విక్టర్ తెలిపారు.

ఎన్యూమరేషన్ ఫారాలు జారీ చేసినప్పటికీ గైర్హాజరైనవారు, నివాసం మారినవారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో పేర్లు నమోదైనవారు, డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించబడిన వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకోలేదని తెలిపారు.

సంబంధిత ఓటర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని సూచించారు. తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు సంబంధిత బూత్ స్థాయి అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు లేదా ఎన్నికల నమోదు అధికారులను సంప్రదించి అవసరమైన గణన పత్రాలను సమర్పించాలని పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన ఓటర్లు 2026 నవంబర్ 21వ తేదీలోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు గణన పత్రాలు సమర్పించాలని అడిషనల్ కలెక్టర్ విక్టర్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందేలా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save