K24 News Telugu
Date of Publish : 07/11/2026, 4:53 pm
Published By Teegala sravan Kumar

ఫేక్ మెసేజ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఇల్లంతకుంట మండలం నవంబర్ 07, K24NEWS TELUGU ప్రతినిధి.

దీపావళికి దేశ ప్రజలకు రూ. 8000 అంటూ వస్తున్న ఫేక్ మెసేజ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని "సమాచార హక్కు వికాస సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మంద వంశీకృష్ణ అన్నారు".

దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రూ. 8,000 అందిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఇలాంటి మెసేజ్ లు పంపుతున్నారని, వాటిని ఓపెన్ చేయవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని సూచించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి లింక్ లపై క్లిక్ చేసే ముందు ‘PAUSE.. THINK.. VERIFY’ అనే సైబర్ భద్రతా నియమాన్ని పాటించాలని కోరుతున్నాము. ఎవరైనా డబ్బులు వస్తాయని చెప్పి OTP, బ్యాంక్ వివరాలు, ఆధార్ వివరాలు అడిగితే అస్సలు ఇవ్వవద్దు.

దీపావళి పండుగను పురస్కరించుకుని సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ఇలాంటి ఫేక్ మెసేజ్ లు వస్తే వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మంద వంశీకృష్ణ తెలియజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save