K24 News Telugu
Date of Publish : 07/11/2026, 10:52 am
Published By P RAJESHKUMAR

చిత్తూరు జిల్లా ప్రజలకు దీపావళి - శుభాకాంక్షలు తెలిపిన జ్యోతి ప్రకాష్

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) నవంబర్ 07.  చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు, మీడియా ప్రతినిధులకు, పోలీసు శాఖ సిబ్బందికి అలాగే ఆర్టీఐ-ఎస్ యాక్టివిస్టులకు ఆ సంస్థ సీఈఓ జ్యోతి ప్రకాష్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ఇంటా బయటా సుఖసంతోషాలతో పాటు నిలకడైన ఆరోగ్యం వెల్లివిరియాలని ఆయన హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పండుగ వేళ అవసరమైన భద్రతా చర్యలపై ఆయన తీసుకోవాల్సిన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా దీపావళి రోజున బాణాసంచా లేదా టపాసులు కాల్చే సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పెద్దల పర్యవేక్షణలోనే చిన్నారులు టపాసులు కాల్చాలని ఆయన సూచిస్తున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా తగిన నిబంధనలను అందరూ తూచా తప్పకుండా పాటించాలని హితవు పలికారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save