K24 News Telugu
Date of Publish : 06/11/2026, 9:07 pm
Published By Teegala sravan Kumar

ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలి.

  • యాసంగి పంటల సాగుపై ముష్టిపల్లిలో రైతులకు అవగాహన.

సిరిసిల్ల, నవంబర్ 06,కే 24  న్యూస్ తెలుగు ప్రతినిధి. 

 రానున్న యాసంగి సీజన్‌లో ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని వ్యవసాయ విస్తరణాధికారి లతశ్రీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ముష్టిపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘కేత్ బచావో అభియాన్, యాసంగిలో పంటలపై ఎల్ నినో ప్రభావం’ అనే అంశాలపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లతశ్రీ మాట్లాడుతూ.. భూసారాన్ని కాపాడుకోవడానికి రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. ఎరువులు, పురుగుమందులను అవసరానికి అనుగుణంగా సరైన మోతాదులో వినియోగించాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు, ముష్టిపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save