కామారెడ్డి జిల్లా నవంబర్ 6:k24 న్యూస్ తెలుగు : భర్త బాగు లేడని దిష్టి తీసి పారావేయడానికి వెళితే తండ్రి కూతురు ప్రాణాలు పోయాయి. కామారెడ్డి జిల్లా లింగాయిపల్లి గ్రామంలోని కుంటలో పడి టెక్రియల్ కి చెందిన తండ్రి సంకరి నర్సింలు, లింగాయిపల్లి కి చెందిన భాగ్య లక్ష్మి(30) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే టెక్రియల్ కు చెందిన నర్సింలు(65) తన కూతురు వద్దకు వెళ్లి, గురువారం అల్లుడి ఆరోగ్యం కోసం దిష్టి తీసే వ్యక్తి వద్ద కు వెళ్లగా దిష్టి తీసే వ్యక్తి, ఆరోగ్యంతో బాధపడుతున్న సోమి శెట్టి మల్లేశంకు దిష్టి తీసి ఊరి అవతల పడివేయ్యాలని తెలుపగా గురువారం రాత్రి 10 గంటల సమయంలో దిష్టి తీసిన అనంతరం గుమ్మడి కాయని కుంట లో పడేసే క్రమంలో కూతురు సోమిశెట్టి భాగ్య లక్ష్మి(30) కుంటలో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు పడిపోగా , రక్షించడానికి వెళ్లిన తండ్రి నర్సింలు, కూతురు భాగ్య లక్ష్మి లోతుగా ఉన్న కుంటలో పడి మృతి చెందినట్లు కుటింబికులు పోలీసుల పిర్యాదు లో తెలిపారు. భాగ్యలక్ష్మి భర్త సోమిశెట్టి మల్లేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా కాలు విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి కి ఒక కూతురు కుమారుడు ఉండగా, సంకరి నర్సింలుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తండ్రి కూతుర్ల మృతితో, ఇటు టెక్రియల్ గ్రామంలో అటు లింగాయి పల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.