K24 News Telugu
Date of Publish : 06/11/2026, 11:29 am
Published By Katta Ravinder

పొన్నం ప్రభాకర్ మంత్రిగా వ్యవహరిస్తున్న నియోజకవర్గంలోనే, గిరిజన ఎరుకల నివాస గుడిసే కూల్చివేత,

  • మండిపడ్డ తెలంగాణ ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్
  • బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం -ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుల కుతాడి శ్రీనివాస్.

  తెలుగు కే న్యూస్   సిద్దిపేట జిల్లా, కోహెడ గ్రామ పంచాయతీ పరిధిలో 1వ ,వార్డు సభ్యుడిగా ఎస్టి సామాజిక వర్గానికి చెందిన కట్ట ప్రవీణ్ కుటుంబం గత 30 సంవత్సరాలుగా నివాసముంటున్న ఇంటిని అమానుష్యంగా రెవెన్యూ అధికారులు పోలీసు బంధవస్తు మధ్య కూల్చివేయడం బాధాకరమని. ఈ విషయాన్ని తెలంగాణ ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. అక్కడ కాంగ్రెస్ గ్రామ సర్పంచ్ గ్రామ కమిటీలలో తనకు అనుకూలంగా తను చెప్పినట్టు 1వ ,వార్డు సభ్యుడు కట్ట ప్రవీణ్ ఉండటం లేదని కక్ష సాధింపుతో ఈ అఘాత్యానికి పాల్పడ్డారని వారు అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన అని వారు ప్రశ్నించారు, తక్షణమే ఈ విషయంపై కలెక్టర్ గారు స్పందించి బాధిత ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని, వారికి ఇంటి స్థలాన్ని కేటాయించి ఇద్దరమ్మా ఇల్లును మంజూరు చేసి కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కక్ష చర్యలకు పాల్పడిన సర్పంచ్ పై వెంటనే చర్యలు తీసుకొని. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు పోరాటం ఆగదని వారు అన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save