K24 News Telugu
Date of Publish : 06/11/2026, 11:30 am
Published By srikanth

కామారెడ్డి జిల్లా లో విషాదం కుంటలో జారి పడి తండ్రి కూతురు మృతి

  • కామారెడ్డి జిల్లా లో విషాదఛాయాలు చోటుచేసుకున్నాయి
  • టేక్రియల్ చెందిన సంకరి పెద్ద నర్సిములు మృతి

కామారెడ్డి జిల్లా నవంబర్ 6 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి జిల్లా లింగాయిపల్లి గ్రామంలోని కుంటలో పడి టెక్రియల్ కి చెందిన తండ్రి సంకరి నర్సింలు, లింగాయిపల్లి కి చెందిన భాగ్య లక్ష్మి మృతి చెందింది. టెక్రియల్ కు చెందిన నర్సింలు తన కూతురు వద్దకు వెళ్లి గురువారం తన కూతురుకి వ్యవసాయ పనిలో సహాయం అందించడానికి ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కుంటలో చేతులు శుభ్రం చేసుకున్న సమయంలో కూతురు భాగ్య లక్ష్మి కుంటలో ప్రమాదవశాత్తు పడిపోగా , రక్షించడానికి వెళ్లిన తండ్రి నర్సింలు, కూతురు భాగ్య లక్ష్మి కుంటలో పడి మృతి చెందారు. భాగ్యలక్ష్మి భర్త సోమిశెట్టి మల్లేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాలు విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి కి ఒక కూతురు కుమారుడు ఉండగా, సంకరి నర్సింలుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తండ్రి కూతుర్ల మృతితో, ఇటు టెక్రియల్ గ్రామంలో అటు లింగ యి పల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save