K24 News Telugu
Date of Publish : 05/11/2026, 7:03 pm
Published By suman

పార్లమెంట్ వేదికపై ప్రసంగించిన శ్రీ నిత్యకు సన్మానం

కరీంనగర్ తెలుగు కే న్యూస్ నవంబర్ 5

6వ డివిజన్ బొమ్మకల్ - గుంటూరుపల్లి కార్పొరేటర్ ఘన సన్మానం జాతీయ స్థాయిలో పార్లమెంట్ వేదికపై యువ నాయకత్వంపై ప్రసంగించి ప్రతిభ చాటిన కరీంనగర్ 6వ డివిజన్ బొమ్మకల్-గుంటూరుపల్లికి చెందిన మాచర్ల మల్లేశం రమ్య దంపతుల కుమార్తె శ్రీనిత్యను 6 వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ ఘనంగా సత్కరించారు. మెమెంటో అందించారు . ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థిని అయిన శ్రీనిత్య, మై భారత్ బృందం, కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రసంగించారు. తెలంగాణ నుంచి ఈ అవకాశం దక్కించుకున్న ఏకైక విద్యార్థినిగా శ్రీనిత్య నిలిచిందని, ఆరవ డివిజన్ బొమ్మకల్ పేరు దేశ వ్యాప్తంగా వినిపించేలా చేసిందని నేటితరం యువతి , యువకులకు ఆదర్శంగా నిలిచిందని కార్పొరేటర్ మేకల వెంకటేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు,యువకులు,గాలిపెల్లి నారాయణ, ఆసిరి తిరుపతి,కాల్వ రాంచంద్రం,పెద్ది లక్ష్మణ్,మూతిక మల్లేశం, బ్రహ్మచారి, మ్యాకల శంకర్, శ్యామల శ్రీనివాస్, మౌటం రాజ్ కుమార్, తాత రాజ్ కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save