K24 News Telugu
Date of Publish : 05/11/2026, 5:53 pm
Published By srikanth

రక్త క్యాన్సర్ ఇక మరణశిక్ష కాదు.. ఆధునిక చికిత్సలతో సంపూర్ణ స్వస్థతకు అవకాశం

  • బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఇమ్యునోథెరపీ, CAR-T చికిత్సలతో వైద్యరంగంలో ముందడుగు

కామారెడ్డి నవంబర్ 5: k24 న్యూస్ తెలుగు: రక్త క్యాన్సర్ (బ్లాడ్) అంటే ఇక మరణశిక్షగా భావించాల్సిన అవసరం లేదని, ఆధునిక వైద్య విధానాలతో ఈ వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశాలు పెరిగాయని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఇమ్యునో థెరపీ, టార్గెటెడ్ థెరపీ, CAR-T సెల్ థెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు రక్త క్యాన్సర్ బాధితులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. గణేష్ జైషేత్వర్ బోన్ మర్రౌ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ డైరెక్టర్ మాట్లాడుతూ

గతంలో రక్త క్యాన్సర్ చికిత్సలో అనేక సవాళ్లు ఉండేవని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సలతో రోగులకు మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా లుకేమియా (ALL, AML) వంటి రక్త క్యాన్సర్ చికిత్సలో CAR-T సెల్ థెరపీలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో ఆధునిక వైద్య సదుపాయాలతో రక్త క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించబడింది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్,ఇమ్యునో థెరపీ, CAR-T చికిత్సల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలని సూచించింది.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. రక్త క్యాన్సర్ ప్రారంభ దశలో సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని.

కారణం తెలియని జ్వరం.

అకారణంగా బరువు తగ్గడం.- శరీరంలో రక్తస్రావం కావడం.తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం.మెడ, చంకలు లేదా ఇతర భాగాల శోషరస గ్రంథులు (లింఫ్ నోడ్స్) వాపు.తీవ్రమైన రక్తహీనత (రక్తహీనత).

రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం.ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన క్యాన్సర్ అని నిర్ధారణ కాదు. అయితే నిరంతరంగా ఇలాంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆధునిక వైద్య చికిత్సలపై అవగాహన పెంచుకోవడం ద్వారా రోగులకు సకాలంలో వైద్యం అందించబడుతుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save