కోహెడ, నవంబర్ 5 (కే24 న్యూస్):
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ-జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టి సుధాకర్, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు బోయిని నిర్మల-జయరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ మండల పర్యవేక్షకులు, సహాయక ప్రాజెక్టు అధికారులు, గ్రామ కార్యదర్శి రాజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.